Loading...

Amazon direct products

అమెరికాలోనూ పేదరికం..........

అమెరికాలోనూ పేదరికం

'దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికాను చూసి చంకలు గుద్దుకుంటే పొరబాటే.. అక్కడా అవినీతి, నిరుద్యోగం, పేదరికం, అవిద్య ఉంది.. అయితే అమెరికాలో రాజకీయ అవినీతికి పాల్పడితే జైలే.. నేతలు ఖర్చు చేసే ప్రతి పైసా ప్రభుత్వానికి లెక్కలు చూపాల్సి ఉంటుంది..' అని అమెరికా దేశంలోని న్యూజెర్సీ రాష్ట్ర ఉపసభాపతి చివుకుల ఉపేంద్ర అన్నారు. 1974లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరుగా అమెరికా వెళ్లి స్థిరపడ్డ ఆయన అక్కడి రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు బాన్స్‌ హోటల్లో 'నెక్‌' ఏర్పాటు చేసిన ప్రయివేట్‌ కార్యక్రమంలో ముఖ్యోపన్యాసం చేశారు.చివుకుల ఉపేంద్ర మాట్లాడుతూ అగ్రరాజ్యమైన అమెరికాలోనూ అవినీతి, నిరుద్యోగం, పేదరికం, అవిద్య ఉందన్నారు.
ఉపాధి కోసం వెళ్లిన తాను కార్పొరేటర్‌గా, మేయర్‌గా పదవులు పొంది న్యూజెర్సీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా భారతదేశానికి, అమెరికాలో ఉన్న వ్యత్యాసాలను వివరించారు. భారతదేశంలో కిందిస్థాయి నుంచి అవినీతి ఉందని, అదే అమెరికాలో పైస్థాయిలోనే ఉందని చెప్పారు. భారతదేశంలో సంపాదించుకోడానికి రాజకీయాల్లోకి వస్తారని, అమెరికాలో సంపాదించుకుని రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు వసూలు చేసే ప్రతి పైసాకు సంబంధించి అమెరికా ప్రభుత్వానికి లెక్కలు చూపాల్సి ఉంటుందన్నారు. అక్కడ రాజకీయాల్లో అవినీతికి పాల్పడితే ఊచలు లెక్కించాల్సిందేనని తెలిపారు. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాలో సమస్యలే ఉండబోవని అనుకుంటే పొరబాటని, నిరుద్యోగం తాండవిస్తోందని అన్నారు.

ఐటిరంగం కుదేలయిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో సంస్కరణలు వస్తున్నాయని, విద్యావ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు తన అమెరికా పర్యటన అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గా రామక్రిష్ణ, నెక్‌ ఛైర్మన్‌ రమేష్‌, టిడిపి జిల్లా అధ్యక్షులు మహదేవనాయుడు పాల్గొన్నారు.

0 comments :

 
TOP